Thursday, August 12, 2010

హారం నిర్వాహకులూ., నిజం చెప్పండీ!






నమస్కారం వెల్కం టు "ఏంటి పైన?!" (ఆంగ్లం లో What's up?!).

ఈనాటి ముఖ్యాంశాలు:


రజకీయ నాయకులు, సినినటులే కాదు వంశ పారం పర్యంగా డాక్టర్లు కూడా కావొచ్చని వాదిస్తూ అప్పారావు గారు ఈ రోజు ఒక టపా వేసారు. ఆయన మాట్లాడుతూ - "మా తండ్రి గారు, తాతగారు, డాక్టర్లు, వారిని చూస్తూ వైద్యం నేర్చాను, మా తాతగారు వాడిన సిరంజీనే నేనూ వాడుతున్నా, అందుకని నేనూ డక్టర్ కావటంలో తప్పేమీ లేదూ" అని అన్నారు. 
వారి వాదన లో నిజముందని భావిస్తూ, వ్యాఖ్యాతలు అప్పారావు శాస్త్రి గారికి అభినందనలు తెలిపారు.

బ్లాగు ప్రారంభించి అయిదు* రోజులే అయినా, టపాల్లో పెద్దగా పస లేకపోయినా, పలు రకాల అపోహలు ఎదురుకున్నా, తక్కువ సమయం లో తన బ్లాగుకి వెయ్యి హిట్స్ అయ్యినందుకు బ్లాగు బాబ్జీ గారు అనందపడ్డట్టు సమాచారం. అయితే, కెలుకుడు లేకపోయినా, ఆస్తిక-నాస్తిక వాదనలు లేకపోయినా, వ్యాఖ్యాతలకి బ్లాగు బాబ్జీ అంటే మోజు ఎందుకు ఎక్కువ, అనేది చర్చనియాంశం.

మాలిక ప్రారంభించిన కొత్తలో, తాము కూడా టపాలను వేగంగా చూపిస్తాము అని బాట్ లా ప్రతీ తెలుగు బ్లాగు లోనూ కామెంటాడిన హారం బృందం మాట తప్పింది. ఈ రోజు "ఏంటి పైన?!" బృందం జరిపిన అనలైజేషన్ లో, అన్నీటికన్నా ముందు, టపాలు, మాలిక లో ప్రదర్శింపబడుతున్నాయి (ఇది సర్వ సాధారణం), ఆ తరువాతి స్థాంనం లో కూడలి నిలవగా, చివరి స్థానం లో హారం నిలిచింది.
అంటే హారం వారు అభద్దం చెప్పారా? లేక పూర్వం టపాలు వేగంగా చూపించినా, తరువాత హోంస్టింగ్ వారి చేతిలో డక్కా-ముక్కీలు తిని ఇప్పుడు వేగం తగ్గార? అనేది తేలాల్సి విశయం.

ఇక పోతే,
కేబ్లాస సభ్యులు, గౌ॥ కల్నల్ ఏకలింగం గారు, వారి బ్లాగులో కేవలం మాలిక కు సంభందించిన టపాలు రాయటం (భవదీయుడి ప్రకారం - వ్రాయటం) మనందరికీ తెలిసిందే. "ఇలా ఎందుకు చేస్తున్నారు, సాధారణ టపాలు ఇక వ్రాయరా?" అని పలు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పుడు సంక్ష్లిప్త వార్తలు:

ఈ వార్తలు ఇంతటి తో సమాప్తం, తిరిగి రేపు కలుసుకుందాం. అంత వరకి సెలవు, నమస్కారం.

*బ్లాగు బాబ్జీ చెప్పిన విధంగా

27 comments:

  1. అప్పారావ్ వ్రాసింది కొంచెం చదివాను. సటైర్ బావుందని అర్ధమయ్యింది కానీ ఆ బ్లాగులో ఎక్కువ సేపు వుండబుద్ధి కాక బయటకి వచ్చేసా. ఏంటో ఆ బ్లాగు రూపు రేఖలు గందరగోళంగా, చికాగ్గా అనిపిస్తాయి.

    ReplyDelete
  2. @శరత్, నేనూ పూర్తి గా చదవలేదు. సేం ప్రాబ్లం.

    ReplyDelete
  3. "ఇలా ఎందుకు చేస్తున్నారు, సాధారణ టపాలు ఇక వ్రాయరా?" అని పలు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
    __________________________________________________

    He will, but give him some time

    ReplyDelete
  4. మీ సమస్యే ఇలా ఉంటే మా అనానిమస్ వాళ్ళ గోల ఎవరు పట్టించుకుంటారు. దీనిని ఎంతైనా ఖండించవలసిందే

    ReplyDelete
  5. రాద్దాం... తొందరేముంది?

    ReplyDelete
  6. ఎనానిమస్ వాళ్ళకి ఎమయ్యింది బాబూ? మేమందరం పబ్లిష్ చేస్తున్నాం కదా. నా బ్లాగులో అయితే మాడరేషన్ కూడ లేదు. As far as my blog is concerned, but for three or four embarrassing moments, the guys have been responsible

    ReplyDelete
  7. అవునవును. అజ్ఞాతల హక్కులకి అప్పుడప్పుడు భంగం కలుగుతోంది. ఎవరో ఒకరిద్దరు అజ్ఞాతలు చెడ్డవారని అందరినీ దుర్మార్గులంటున్నారు బ్లాగు ప్రజలు. మీరంతా ఓ సంఘం పెట్టేసి మలక్కును అధ్యక్షునిగా ఎన్నుకొని మీ బ్లాగుల్లో హక్కుల కోసం పొరాడండి. అన్ని బ్లాగుల్లోనూ అజ్ఞాతల కామెంట్లు ఎనబుల్ చెయ్యాలనేది మీ మొదటి డిమాండూ.

    ReplyDelete
  8. Another workaround is to create a fake id (when a blog doesnt allow anonymous comments) :)) \

    ReplyDelete
  9. నోప్. అజ్ఞాతల కోసం బ్లాగర్లు మారాలి కానీ బ్లాగర్ల కోసమని అజ్ఞాతలు మారి ఫేక్ ఐడిలు తయారుచేసుకోవడమా! నెవ్వర్! కదా అజ్ఞాతల్లారా? మీరు కొద్దిక్కూడా తగ్గొద్దు. మీ డిమాండ్లు నెరవేరేదాకా మలక్కును నిరాహారదీక్ష చేయమండి. మీకేం భయం లేదు.

    కత్తి కాంతారావూ, కామెంట్సుకి వర్డ్ వెరిఫికేషను తీసివేయవయ్యా బాబూ.

    ReplyDelete
  10. ఏంటి బాబులూ? ఏకలింగం ఎపాలజీ వదిలేసి మలక్ నిరాహారదీక్ష మొదలెట్టారా?

    ReplyDelete
  11. అజ్ఞాతల తరఫున నేను ఆయాసపడటమే కానీ ఏదీ ఒక్క అజ్ఞాతన్నా ముందుకు రావడం లేదూ!

    ReplyDelete
  12. అన్నా మలక్కూ ఎంత మంచి వాడవన్నా! మోడరేషన్ కూడా తీసేసి మా హక్కులకు నిజమైన న్యాయం చేస్తున్నావన్నా, నీలో ఒక ఇంద్ర ఒక ఠాగూర్ ఒక జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడన్నా. మోడరేషన్ పెట్టే వాళ్ళాందరూ కేసియార్ కార్యకర్తలగుదురుగాక. హాస్పిటలో నీరసం వచ్చే వరకు శరత్తు నిరాహార దీక్ష చేస్తాడు కావలంటే

    ReplyDelete
  13. @కత్తి కాంతారావు : బాగుందండీ మీ బ్లాగ్ , అందరూ కూడలి హారం , మాలిక వదిలేసి మీ బ్లాగ్ చూడచ్చు
    @శరత్, అసలే నాది సెటైర్ ల బ్లాగ్ , అయినప్పటికీ అజ్ఞాతలకి కూడా అవకాశం, అందులోనూ మాడరేషన్ లేదు
    ఇక కుమ్ముడే కుమ్ముడు
    ఎంత గొప్ప అవకాశం
    మీరు చెప్పినట్లు బ్లాగ్ టెంప్లేట్ మార్చాను
    ఒక్కసారి చూసి చెపితే మార్పులు చేర్పులు చేస్తా

    ReplyDelete
  14. హాస్పిటలో నీరసం వచ్చే వరకు శరత్తు నిరాహార దీక్ష చేస్తాడు కావలంటే
    _______________________________________________

    హే జజ్జినక, హే జజ్జినక!! అదే మాటమీద ఉండు - శరత్తుకి దండేసి టెంటులో కూర్చోబెడదాం!!

    ReplyDelete
  15. నీలో ఒక ఇంద్ర ఒక ఠాగూర్ ఒక జగన్మోహన్ రెడ్డి
    _________________________________

    ఈ ట్విస్టేంటి స్వామీ? ఇంద్ర, ఠాగూర్ అందరినీ చంపుకుంటూ పోతే, జగన్ మిగిలినవాళ్ళని ఓదారుస్తాడనా?

    ReplyDelete
  16. బాబ్జీ సంగతి తర్వాత
    ఇలాంటి విషయాలు రాస్తున్న మీరు కూడా మూడే మూడు రోజుల్లో వెయ్యి హిట్లు దాటేసారే!

    ReplyDelete
  17. @వాట్స్ ప్

    నేనే హారం నిర్వాహకుడిని.
    >> మాలిక ప్రారంభించిన కొత్తలో, తాము కూడా టపాలను వేగంగా చూపిస్తాము అని బాట్ లా ప్రతీ తెలుగు బ్లాగు లోనూ కామెంటాడిన హారం బృందం మాట తప్పింది.

    ఏవీ మీ దగ్గరున్న ఆధారాలు చూపిస్తారా?

    >> ఈ రోజు "ఏంటి పైన?!" బృందం జరిపిన అనలైజేషన్ లో, అన్నీటికన్నా ముందు, టపాలు, మాలిక లో ప్రదర్శింపబడుతున్నాయి (ఇది సర్వ సాధారణం), ఆ తరువాతి స్థాంనం లో కూడలి నిలవగా, చివరి స్థానం లో హారం నిలిచింది.

    Where is your analysis. Show me the basis

    >> అంటే హారం వారు అభద్దం చెప్పారా?

    LOL :-) I am not a lier like you.

    >>లేక పూర్వం టపాలు వేగంగా చూపించినా, తరువాత హోంస్టింగ్ వారి చేతిలో డక్కా-ముక్కీలు తిని ఇప్పుడు వేగం తగ్గార? అనేది తేలాల్సి విశయం.
    ఆధారాలతో చూపిస్తే సంతోషిస్తాము. ఇలాంటివి వ్రాసే ముందు కొద్దిగా టెక్నాలజీ గూర్చి ఆ సైట్ వివరాలు తెలుసికొని వ్రాస్తే బాగుంటుంది.



    Waiting for your Analysis :)

    ReplyDelete
  18. ఓ... ఈ ఎంటి పైన బ్లాగు బావుందే....

    కొందరు కారణ జన్ములు... వారు ఎం చెయ్యాలొ వారు పుట్టకముందే డిసైడ్ అయిపొతుంది... అలాంటివారిలొ కొందరు ......
    ఏకలింగం - అపాలజి చెప్పడానికి కి , శరత్ - తొడ కొట్టడానికి, మలక్ -నిరాహార దీక్ష చెయ్యడానికి...
    ఇది మాఎచె శక్తి ఎవరికి లేదు... వాళ్ళకే లేదు :-))

    హారం - మాలిక - కూడలి విషయం లొ మీ అనాలసిస్ తప్పు.... అప్పుడెప్పుడొ శ్రీనివాస్ పొస్ట్ వేసినప్పటినుండి రెగ్యులర్గా గమనిస్తున్నా... చాలా సమయాల్లొ మాలిక - హారం ఇంచు మించు సమానంగా వున్నాయి... కూడలి ఎక్కడొ కింద వుంది... నాకు టెక్నికల్ డిటైల్స్ తెలీవు కాదు బహుశ కూడలి రెఫ్రెష్ అయ్యిన ఇన్స్టంట్ లొ ఒక్కసారి గమనించి కూడలి మాలిక, హారం కన్న ఫాస్ట్ అనుకుని ఉండొచ్చు...

    ReplyDelete
  19. @ శరత్ 'కాలమ్' said..

    >> అజ్ఞాతల తరఫున నేను ఆయాసపడటమే కానీ ఏదీ ఒక్క
    >> అజ్ఞాతన్నా ముందుకు రావడం లేదూ

    అన్నా, నీ ముందు నేనున్నా! ఆల్రెడీ దీనిమీద ఒక పోస్టెట్టా

    ReplyDelete
  20. సందెట్లో సడేమియా చోటామీయాలో బడేమియా అంటే ఇదే విషయం లేకున్నా 21 కామెంట్లు హ్మ్.. ఇంతోటి దానికి వర్డు వెరిఫికేషన్ ఒకటి

    ReplyDelete
  21. Ee roju evening update :

    Haaram pai Entipain aaropanalu. Bha Ra Re & Manchu khandana.

    Ee vishayam gurinchi pramukha Sanketika nipunudu, teegala veerudu Praveen Sarma alias Maarthanda to saayantram charchaavedika.

    Ee vishayam pai meeru entipaina abhipraayalato ekeebhavistunnaara pakkana vunna poll lo telupagalaru. Inka entipaina ki SMS fecility raaledu, anduvalla SMS avakaasam kalpincalenanduku chintistunnam.

    :P

    ReplyDelete
  22. nenu chusina daani prakaaram maalika haram lo modatagaa vastunnayi kudali aatarvatha post avutunnayi....techinal vishayalayite naku telidu naa observation cheppa

    ReplyDelete
  23. In my observation i found ..Haaram is the fastest of all the three...what ever the analysis u follow that is the fact..

    ReplyDelete
  24. హారం గూర్చి తరువాతి టపాలో రాయబోతున్నాను.

    ReplyDelete
  25. కత్తి కాంతారావు గారికి,

    నాకు స్వతహాగా రెండు అనే సంఖ్య నచ్చదు. కానీ నా దురదృష్టమేమిటో నా జీవితంలో నాకు అన్నీ రెండుతోనే ముడిపడి ఉంది. దానికి మరో సాక్షం మీరు నా గురించి మీ రెండొవ టపాలో వ్రాసారు. నాకు నచ్చలేదు .. ఏకలింగం గారు మీరు ఈ విషయాన్ని ఖండించి వీరి చేత క్షమాపణలు చెప్పిచాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

    అలాగే మీరు నా మనోభావాన్ని దెబ్బతీసినందున నేను మీపై అమెరికా కోర్టులో కేసు వేస్తున్నాను.

    ఇట్లు
    భవదీయుడు,
    చక్రవర్తి

    PS: కాంతారావుగారు, మంచి పని చేస్తున్నారు అని అనను కానీ, తెలుగు బ్లాగుల సమాచార శ్రవంతి అన్న టాగ్ లైన్ నాకు నచ్చింది. ఒకప్పుడు ప్రొద్దులో ఒకప్పుడు ఇలా చేసే వారు, ఈ మధ్య చేస్తున్నట్లు లేరు. మీరెంత కాలం చేస్తారో కానీ చేసినంత కాలం వీలైనన్ని బ్లాగులు దర్శించమనవి. అంతే కాని కొన్ని బ్లాగులకే పరిమితం అవ్వ వద్దని మనవి. ఆంగ్లంలో చెప్పాలంటే.. good work and a unique initiation. Keep the work going and let the list get bigger.

    ReplyDelete
  26. మరో సారి అర్థం-పర్థం లేని చర్చ చేసిన ప్రవీన్ శర్మ
    >>>>>>>>>
    ఆ చర్చ అర్థవంతమినదే.

    ReplyDelete